Saturday, 1 March 2014
క్షమించగలిగే గొప్ప హౄదయం న్యూటన్ ది
క్షమించగలిగే గొప్ప హౄదయం న్యూటన్ ది
ఐజాక్ న్యూటన్ ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈయన ప్రతిరోజూ కొన్ని గంటల పాటు, 20 సంవత్సరాలు కష్టపడి చేసిన పరిశోఢనా ఫలితాలు రాసి ఉంచారు. ఒకరోజు ఆ కాగితాలు బల్ల పైన పెట్టి బైటికి వెళ్ళారు. ఆయన పెంపుడు కుక్క ” డైమండ్ ఆ గది లోనే పడుకుని ఉంది. కొద్దిసేపటి తరవాత ఆ కుక్క ఆడుకుంటూ ఆ కాగితాలు ఉన్న బల్ల పైకి దూకింది .
అలా దూకడం లో అక్కడ ఉన్న వెలుగుతున్న కొవ్వొత్తి ఆ కాగితాల మీద పడింది.20సంవత్సరాలు కష్టపడి రాసిన పరిశోధనా ఫలితాలు క్షణాల్లో బూడిద అయిపోయాయి.బైటనుండి తిరిగి వచ్చిన న్యూటన్ అది చూసి స్తంభించిపొయాడు. ఇంకెవరయినా అయితే ఆ కుక్కని కొట్టి చంపేసేవారు. కాని న్యూటన్ కుక్క తల మీద తట్టి డైమండ్ నువ్వేమి చేసావొ నీకు తెలియదు అని క్షమించి వదిలేసాడు. మళ్ళీ ఎన్నో సంవత్సరాలు కష్టపడి పరిశోధన ఫలితాలు రాసుకున్నాడు. నోరు లేని జంతువులని కూడ క్షమించగలిగే గొప్ప హౄదయం న్యూటన్ ది.
నీతి:-
ఎవరివల్ల అయినా మనకు బాధ కలిగినప్పుడు క్షమించి వదిలెయ్యడం చాల కష్టం .కాని మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే సాధించవచ్చు. క్షమిస్తూ ఉండడం అలవాటుగా చేసుకుంటే అందరూ మనకు స్నేహితులు గానే ఉంటారు, శత్రువులు ఉండరు.
Related Posts:
Subscribe to:
Post Comments (Atom)
0 comments: