Saturday, 8 March 2014
ఎదుటి వారితో మాట్లాడెప్పుడు మాట తూల కుండా చూసుకోవాలి
ఎదుటి వారితో మాట్లాడెప్పుడు మాట తూల కుండా చూసుకోవాలి
ఇరుగు పొరుగు ఇద్దరు రైతులు ఉండేవారు...
మొదటి రైతు పొలంలో కొంత పంట నాశనం అయింది.. రెండవ రైతు మీద అనుమానం వచ్చింది... అలా వరుసగా రెండవ రోజు కూడా జరుగడంతో... పంట చేతికి వచ్చే సమయానికి ఇలా నష్టం జరుగుతుందే అని..... సహనం చనిపోయిన మొదటి రైతు రెండవ వానిని నోటికి వచ్చినట్లు చెడామడా తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.... రెండవ రైతు చలించక పోవడంతో తన అనుమానం కరెక్టే అని నిర్దారించుకున్నాడు...
కాని మరుసటి రోజు తెల్లవారు జామున పొలంకు నీరు పెడదామని వచ్చి చూస్తే ఒక ఆవు కంచే దాటి వచ్చి పొలం నాశనం చేస్తుంది.. ఆవును తరిమి.. తప్పుగా రెండవ రైతును అర్దం చెసుకుని తిట్టినందుకు బాద పడ్డాడు...
క్షమాపణ అడగడానికి రెండవ రైతు దగ్గరకు వెళ్ళాడు...
రెండవ రైతు... క్షమాపణ అవసరం లేదు నేను చిన్న పని చెప్తా చేస్తావా....?? అని అడిగాడు......
అందుకు మొదటివాడు సరే అని ఆనందంగా ఒప్పుకున్నాడు..
ఒక సంచి నిండుగా మామిడి ఆకులు ఇచ్చి ఊరి చివర ఉన్న హద్దు రాయి దగ్గర పోసి వస్తావా అని అడిగాడు..
మొదటి వాడు సరే అని అలాగే చేసి వచ్చాడు...
తిరిగి వచ్చాక.. రెండవ వాడు.... అరర్రే... నేను ఒక సంచి ఇవ్వ బోయి ఇంకొకటి ఇచ్చాను... ఎమనుకోకుండా నీవు పోసిన ఆకులు మళ్ళి తీసుకుని రా... అని పంపించాడు...
సరే అని మొదటి వాడు హద్దు వరకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక్కటీ లేవు... గాలి వలన మొత్తం ఎగిరి పోయాయి..
కాళీ సంచితో తిరిగి వచ్చి... జరిగిన విషయాన్ని చెప్పాడు...
అందుకు రెండవ వాడు నవ్వి...
చూసావా పారేయడం చాలా తేలిక.. తిరిగి తీసుకురావడం చాలా కష్టం నోటి నుంచి జారిన మాట కూడా అంతే... నీకు తెలియ చెప్పాలనే నీకు ఆ పని చెప్పాను... అని అక్కడ నుంచి వెళ్ళి పోయాడు...
నీతి: ఎదుటి వారితో మాట్లాడెప్పుడు మాట తూల కుండా చూసుకోవాలి...... సమెత చెప్పినట్టు నోటి మాట.. తుపాకి నుండి వెళ్ళిన బుల్లేట్టు తిరిగి రావు... గాయపరచడం తప్ప...
Related Posts:
Subscribe to:
Post Comments (Atom)
చాలా సహజంగా,చిన్నపిల్లలకు సైతం అర్ధమయ్యేలా బాగుంది నీతి కథ.
ReplyDeletethank you
Delete